People Burnt TSRTC Bus in Patancheru : ప్రయాణ ప్రాంగణంలో నిలిపిన ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ బస్సుకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ బస్సు ముషీరాబాద్ -2 డిపోకు చెందిన ఏపీ11జెడ్ 6893 నెంబర్ బస్సుగా గుర్తించారు. అక్కడే ఉన్న ప్రయాణ ప్రాంగణ సెక్యూరిటీ, ఆర్టీసీ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లేకపోతే బస్సు మెుత్తం అగ్ని ఆహుతి అయ్యేది.
అప్పటికే నాలుగు సీట్లు దగ్ధమైనట్లు బీహెచ్ఇఎల్ డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని సుధాకర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.