కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని అనంతపురం జిల్లా శ్రీనివాస్ నగర్లో... కొంతమంది బడులను మాంసపు విక్రయ, వధ కేంద్రాలుగా, పశువుల కేంద్రాలుగా మార్చేశారు. అక్కడి ప్రాథమిక పాఠాశాలలో కొంతమంది వ్యక్తులు జంతువులను వధిస్తున్నారు.
అనంతరం అక్కడే వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నగరపాలక అధికారులు, పోలీసులు... పాఠశాల వద్దకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. పాఠశాలలో ఇటువంటి పనులు చేస్తే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'