ETV Bharat / city

'దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ'

ఆసరా పింఛన్​ల వల్ల వృద్ధుల జీవితాల్లో వెలుగు నిండుతున్నాయని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు​ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో పింఛన్​ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. పింఛన్​ పంపిణీపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

"పింఛన్​ల వల్ల వృద్ధుల జీవితాల్లో వెలుగు నిండింది"
author img

By

Published : Sep 21, 2019, 2:47 PM IST

Updated : Sep 21, 2019, 3:44 PM IST

"పింఛన్​ల వల్ల వృద్ధుల జీవితాల్లో వెలుగు నిండింది"

దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు ఎక్కువ మొత్తంలో పింఛన్​ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్​, పంజాబ్​తోపాటు... మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.500లు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్​ల కోసం ముఖ్యమంత్రి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిచినట్లు వెల్లడించారు. ఏటా ఇచ్చే మొత్తం 9వేల 192,88కోట్లు కాగా... దీంట్లో కేంద్ర ప్రభుత్వ కోటా చాలా తక్కువని చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అతిక్కువ పింఛన్​ ఇస్తూ ప్రజల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

ఇవీ చూడండి: 'పురపాలక' బిల్లుకు శాసనసభ ఆమోదం

Last Updated : Sep 21, 2019, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.