Penna River flood Drone Visuals: నెల్లూరు జిల్లాలో పెన్నానది సృష్టించిన వరద.. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ప్రజల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కోవూరు మండలం సాలుచింతల ప్రాంతంలో ఆదివారం చిత్రీకరించిన దృశ్యాలివి..! ఉహించనిస్థాయిలో వచ్చిన వరద అనేక గ్రామాలను చుట్టుముట్టింది. ఉద్ధృతిని తగ్గించేందుకు అధికారులు పెన్నా పొర్లుకట్టకు గండి కొట్టి.. తిరిగి పెన్నానదిలో వరద కలిసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే జనం తీవ్రంగా నష్టపోయారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల(Nellore rain news latest) వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ జలదిగ్బంధంలో ఉండగా.. వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లు నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో.. పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. జిల్లాలోని ఇందుకూరుపేట పేట మండలం ముదివర్తి పాలెం వద్ద ఉన్న పెన్నా పొర్లు కట్ట తెగిపోవడంతో 5 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ముదివర్తి పాలెం, నిడు ముసలి, కె ఆర్ పాలెం, రాముడు పాలెం గ్రామాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. కృష్ణపట్నం చిన్న తూముల వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
Somasila dam news latest: నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 4,02,100 క్యూసెక్కులు ఉండటంతో.. అధికారులు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఔట్‌ఫ్లో 3,82,016 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల గరిష్ఠ నీటిమట్టం 77.988 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 70,075 టీఎంసీలకు చేరుకుంది. వరద నీటిని కిందకు వదలడంతో.. అధికారులు పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
Nellore rain damage news: భారీ వర్షాలతో ఏపీలోని నెల్లూరు జిల్లాలో గల రహదారులు దెబ్బతిన్నాయి. వంతెనలు బలహీనపడి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. నెల్లూరు శివారులో పెన్నా నదిపై వంతెన బలహీనపడింది. దాంతో అర్ధరాత్రి 12 నుంచే జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేశారు. మరోవైపు పెన్నానది వద్ద 16వ నంబరు జాతీయ రహదారికి గండి పడింది. ఫలితంగా చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలను నిలిపివేశారు. నెల్లూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి.