ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో గల పెన్నా నదిపై నిర్మించిన వంతెన రోజురోజుకూ(Penna bridge damaged) కుంగుతోంది. గండికోట, మైలవరం జలాశయాల నుంచి నీరు విడుదల చేస్తుండటంతో.. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద తాకిడికి ఈ నెల 22న వంతెన మధ్య భాగం కుంగింది. ప్రయాణికులు గమనించి, పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.
వారం రోజులుగా మైలవరం నుంచి భారీగా వరద వస్తుండటంతో .. బ్రిడ్జి మధ్య భాగం మరింతగా(Penna bridge latest news) కుంగిపోయింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వంతెన వైపు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నెల 22న గుర్తించిన స్థానికులు...
ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్నా నదికి ఇంకా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో జమ్మలమడుగు-ముద్దనూరు మధ్యలో ఉన్న పెన్నా వంతెన వరద ఉద్ధృతిని తట్టుకోలేక ఈ నేల 22న (Penna bridge damaged at jammalamadugu) కుంగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు.. సిబ్బందితో కలిసి వెంటనే వంతెన వద్దకు చేరుకొని పరిశీలించారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ రోజు వంతెన మరింతగా కుంగిపోవడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.
13 ఏళ్లకే కూలిపోయే స్ధితికి...
2008 డిసెంబర్ 4న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని ప్రారంభించారు. 13 ఏళ్లకే వంతెన కూలిపోయే స్ధితికి చేరుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన (Penna bridge) కింద ఉన్న ఇసుకను అక్రమంగా రవాణా చేయడమే.. కుంగిపోవడానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: పట్టుకున్న పాము కాటేసి వృద్ధుడు మృతి