ETV Bharat / city

'నా కుమారుడు పబ్​కు వెళ్తే తప్పా..? అదేమన్న డ్రగ్స్​ దుకాణమా..?' - అనిల్​ కుమార్​ యాదవ్

Hyderabad Drugs Case: హైదరాబాద్​లో బంజారహిల్స్​లోని పుడింగ్‌ అండ్‌ మింట్‌ పబ్‌లో దొరికిన డ్రగ్స్​ పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల కుటుంబాల్లో కలకలం సృష్టిస్తోంది. నిన్న(మార్చి 2న) రాత్రి పబ్​పై టాస్క్​ఫోర్స్​ జరిపిన దాడిలో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. అందులో భాగంగా పీసీసీ​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజనీకుమార్​ యాదయ్​ చిన్న కుమారుడు కూడా.. దాడి సమయంలో పబ్​లోనే ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలపై అంజనీకుమార్​ యాదవ్​, అనిల్​ కుమార్​ స్పష్టతనిచ్చారు.

14918156
14918156
author img

By

Published : Apr 3, 2022, 7:12 PM IST

Updated : Apr 3, 2022, 7:27 PM IST

'నా కుమారుడు పబ్​కు వెళ్తే తప్పా..? అదేమన్న డ్రగ్స్​ దుకాణమా..?'

Hyderabad Drugs Case: హైదరాబాద్​లోని ఫుడ్​ అండ్​ మింట్​ పబ్​లో డ్రగ్స్​ దొరకటం.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలవరపెడుతోంది. దాడి సమయంలో.. కొందరు సెలబ్రెటీలు, విదేశీయులతో పాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే.. సదరు పబ్​కు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అంజనీకుమార్​ యాదవ్​ చిన్నకుమారుడు అరవింద్​ కూడా వెళ్లినట్టు సమాచారం బయటికి రావటంతో.. ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై స్పందించిన అంజనీ కుమార్​ యాదవ్​, ఆయన పెద్ద కుమారుడు అనిల్​ కుమార్​ యాదవ్​.. స్పష్టతనిచ్చారు.

నా కొడుకు పబ్​కు వెళ్లాడు కానీ..

తన చిన్న కుమారునిపై వస్తున్న వార్తలను అంజనీకుమార్​ యాదవ్​ తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే తమపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. తన చిన్నకుమారుడు పబ్​కు వెళ్లిన విషయం వాస్తవమేనన్న అంజనీకుమార్​.. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవటం తప్పా అని ప్రశ్నించారు.

"నా కొడుకు ఒక్కడే పబ్​కు పోలేదు. పార్టీ ఉంటే స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇది తప్పా. అతనేమైనా డ్రగ్స్​ దుకాణానికి పోయిండా.. పబ్​కే కదా..? పబ్​కు వెళ్లటం తప్పయితే.. మరి ప్రభుత్వం ఎందుకు ఇష్టానుసారంగా నడిపేందుకు అనుమతులిస్తోంది. పబ్​కు వెళ్లినంత మాత్రాన డ్రగ్స్​ కేసు అంటగడతారా..? డ్రగ్స్​పై పోరాటం చేస్తున్న మాపై బురద జల్లేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మా కుటుంబాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరో విదేశీయులు డ్రగ్స్‌ తీసుకుంటే అందరినీ అందులోకి లాగటం కరెక్ట్​ కాదు. పబ్​లే లేకపోతే.. ఎవ్వరూ పోకుండా ఉంటారు కదా..? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పబ్​లను బంద్​ చేయాలని నా డిమాండ్​."

- అంజనీకుమార్​ యాదవ్​, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

మా తమ్ముడు ఏ పరీక్షకైనా సిద్ధమే..?

తమ సోదరుడు పబ్​కు​ వెళ్లాడని స్పష్టం చేసిన అనిల్​కుమార్​ యాదవ్​.. దాడికి ముందే ఇంటికి వచ్చేశాడని తెలిపారు. ఒకవేళ పోలీసులు పట్టుకున్న వాళ్లలో అరవింద్​ ఉండి ఉంటే.. ఠాణాలో ఉండేవాడు కదా అని వివరించారు. తమ సోదరుడు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఏదైనా ఆధారాలు ఉంటే పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబంపై బురదజల్లడం సరియైంది కాదని హితవు పలికారు.

"మా తమ్ముడు.. ఓ బర్త్​డే పార్టీ ఉంటే స్నేహితులతో కలిసి పబ్​కు వెళ్లాడు. కానీ.. ముందే ఇంటికి వచ్చేశాడు. ఒకవేళ దాడి జరిగిన టైంలో పబ్​లోనే ఉండి ఉంటే.. పోలీస్​స్టేషన్​కి తీసుకెళ్లేవారు కదా..? గతంలో కూడా అరవింద్​పై ఇలాంటి వార్తలు వచ్చాయి. మా తమ్ముడు డ్రగ్స్​ తీసుకున్నట్టు ఏమైనా అధికారిక ఆధారాలుంటే.. పబ్లిక్​ డొమైన్​లో పెట్టాలి. మా తమ్మున్ని ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా.. ఏ పరీక్షలకైనా సిద్ధం. అయినా.. పబ్​లో టేబుళ్లపైన డ్రగ్స్‌ దొరికాయంటే.. హైదరాబాద్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందో తెలిసిపోతోంది." - అనిల్​కుమార్​ యాదవ్​, కాంగ్రెస్​ యువనేత

సంబంధిత కథనాలు..

Last Updated : Apr 3, 2022, 7:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.