ETV Bharat / city

Revanth Fires On KCR: 'పాకిస్తాన్​ సరిహద్దుల్లోని సైన్యం కంటే ఎక్కువ మోహరించారు'

author img

By

Published : Dec 31, 2021, 7:45 PM IST

Revanth Fires On KCR: ఉద్యోగుల బదిలీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపానికి గురై.. ఒక ఉపాధ్యాయుడు మరణించారని ఆరోపించారు. ఆ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్లేందుకు యత్నిస్తే.. పోలీసులతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Revanth Fires On KCR
revanth reddy

Revanth Fires On KCR: ఉద్యోగుల బదిలీలు, కేటాయింపులకు సంబంధించిన జీవో నంబరు 317 రాజ్యాంగానికి విరుద్దమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల్లో పాలకుల నిర్ణయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా అన్న అసంతృప్తిలో ప్రజలున్నారని రేవంత్​రెడ్డి చెప్పారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికత ప్రాధాన్యతగా ఉండాలని డిమాండ్​ చేశారు. ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించినా పుట్టి పెరిగిన చోట ఉద్యోగం ఇవ్వాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న రేవంత్​.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనూ రోడ్డెక్కేలా చేశారని మండిపడ్డారు.

Revanth reddy on Teachers Transfers: ప్రధానోపాధ్యాయుడు బాణోత్ జేత్రాం.. సొంత జిల్లాలో ఉంచాలని కోరినా ములుగు జిల్లాకు బదిలీ చేశారని.. ఆ బాధను భరించలేక గుండెపోటుతో మరణించారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో ఓ ఉపాధ్యాయుడు మరణిస్తే.. విద్యాశాఖ మంత్రి కూడా పట్టించుకోలేదని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచనా చేయడం లేదని ధ్వజమెత్తారు.

తమ సహనానికీ ఓ హద్దు ఉంటుందని.. అది దాటితే జైల్‌ భరోకు పిలుపునిస్తామని రేవంత్​ హెచ్చరించారు. అప్పుడు ఎంతమందిని అరెస్ట్​ చేస్తారో చూస్తామన్నారు. పోలీసులతో తమను అడ్డుకోవాలని చూస్తున్నారని.. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకుంటాయని రేవంత్​రెడ్డి ప్రకటించారు.

'జీవో 317 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పుట్టి పెరిగిన జిల్లాలో పోస్టింగ్​లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వారిని ఈడ్చుకుపోయి.. గొర్రెలను తోలుకొని పోయినట్లు పోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన ఉపాధ్యాయులకే ఈ గతి పడితే .. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేయండి. మరణించిన ఉపాధ్యాయుడి కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్తామంటే.. ఇళ్లవద్ద వందలాది మంది పోలీసులను మోహరించడం ఏం సాంప్రదాయం. పాకిస్తాన్​ సరిహద్దుల్లో ఉన్న సైన్యం కంటే ఎక్కువగా మోహరించారు.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Revanth Fires On KCR: 'పాకిస్తాన్​ సరిహద్దుల్లోని సైన్యం కంటే ఎక్కువ మోహరించారు'

ఇదీచూడండి: HM died due to transfers : బదిలీ ఆవేదనతో ఆగిన ప్రధానోపాధ్యాయుడి గుండె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.