ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి పది ప్రశ్నలు

Revanth Reddy on Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ ఇక ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు.

revanth reddy cm kcr
revanth reddy cm kcr
author img

By

Published : Apr 11, 2022, 5:41 PM IST

Revanth Reddy on Paddy Procurement : తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ఉరితాళ్లు బిగిస్తూ కేంద్రానికి లేఖ రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు... మీ రెండు పార్టీల మోసాలను గ్రహించలేరా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పది ప్రశ్నలతో కూడిన లేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ ఇక ఇవ్వబోమని 2021 అక్టోబరు 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా..? అని నిలదీశారు.

ఇప్పుడు...ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే... ఆ రెండు పార్టీల మోసాలను రైతులు గ్రహించలేరా..? అని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస చిత్తశుద్ధిపై రైతులకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7,500 కోట్లు నష్టం వచ్చినట్లు పేర్కొని ప్రభుత్వం...ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన చేయలేదా అని నిలదీశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆడుతున్న నాటకాల్లో ఇప్పటికీ రైతులు దళారీల చేతుల్లో నష్టపోతున్న విషయం నిజం కాదా..? ప్రశ్నించారు. ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిస్సహాయ స్థితిలో రైతులు ధాన్యాన్ని రూ.1,200 - రూ.1,400కే మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం వాస్తవం కాదా..? అని నిలదీశారు. యాసంగి సీజన్‌లో కూడా ముందస్తుగా చేతికి వచ్చే ధాన్యం... రా రైస్‌గా వచ్చే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్​లైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.