ETV Bharat / city

25 రాష్ట్రాలతో యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర చేసేయండి: పవన్‌కల్యాణ్

Pawan kalyan Fires on YSRCP Government: వైకాపాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌నూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించి 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులకు వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అమెరికాలోని మౌంట్‌ రష్‌మోర్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసిన పవన్‌.. అది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ - విశ్వాసాలకి చిహ్నంగా పేర్కొన్నారు.

25 రాష్ట్రాలతో యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర చేసేయండి: పవన్‌కల్యాణ్
25 రాష్ట్రాలతో యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర చేసేయండి: పవన్‌కల్యాణ్
author img

By

Published : Oct 11, 2022, 4:11 PM IST

Pawan kalyan Fires on YSRCP Government: ఏపీలోని వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వరుస ట్వీట్లు సంధిస్తున్నారు. ఏపీని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్రాగా పేర్కొంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు. ఏపీని కూడా 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించండని పవన్‌ అన్నారు. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులకు వెళ్లండని ఎద్దేవా చేశారు. ఏపీని వైకాపా రాజ్యంగా మార్చుకోండని దుయ్యబట్టారు. దయచేసి సంకోచించకండి, సంకోచించకండంటూ మాట్లాడారు. సర్వతోముఖాభివృద్ధికి మంత్రం వికేంద్రీకరణ అనుకుంటే 3 రాజధానులే ఎందుకని ప్రశ్నించారు. ఏది ఏమైనా వైకాపా చట్టానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారని పేర్కొన్నారు.

  • United States of America లోని South Dakota లో ఉన్న
    ‘మౌంట్‌ రష్‌మోర్.‌’

    ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం. pic.twitter.com/D3lz55j9g1

    — Pawan Kalyan (@PawanKalyan) October 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • … as well declare AP as
    “United States of Andhra” & announce 25 districts as States & go for 25 capitals. ‘Make AP as your YCP Fiefdom’.
    And please don’t hesitate, feel free.

మిగిలిన పౌరులు ఏం భావిస్తున్నారో ఒక్క పైసా కూడా పట్టించుకోరని పవన్‌ ధ్వజమెత్తారు. యూఎస్‌ఏ దక్షిణ డకోటాలోని మౌంట్‌ రష్‌మోర్ చిత్రాన్ని పవన్​ ట్వీట్‌లో ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ-విశ్వాసాలకు మౌంట్‌ రష్‌మోర్ చిహ్నంగా అభివర్ణన ఉందన్నారు. రుషికొండలో ఉన్న ఈ మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌ 'ధన-వర్గ-కులస్వామ్యానికి' చిహ్నమని పవన్‌ తెలిపారు.

  • “United States of Andhra“
    విశాఖ జిల్లా లోని,రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న..

    ఈ “మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌"

    “ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం”

    P.S (బూతులకి కూడా…) pic.twitter.com/ckxlO21ZGl

"ఏపీని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించండి. 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైకాపా రాజ్యంగా మార్చుకోండి. దయచేసి సంకోచించకండి, సంకోచించకండి. సర్వతోముఖాభివృద్ధికి మంత్రం వికేంద్రీకరణ అనుకుంటే 3 రాజధానులే ఎందుకు. ఏది ఏమైనా వైకాపా చట్టానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏం భావిస్తున్నారో ఒక్క పైసా కూడా పట్టించుకోరు. రుషికొండలో ఉన్న ఈ మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌ 'ధన-వర్గ-కులస్వామ్యానికి' చిహ్నం." -జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​

ఇవీ చదవండి..:

ములాయం పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం

డబ్బుకు ఆశపడి నరబలి.. ఇద్దరు మహిళల హత్య.. తల్లి ఎదుటే కుమార్తెపై గ్యాంగ్​రేప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.