మనకున్న సాహిత్య విలువలను అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు పరిశ్రమ నుంచి అందించవచ్చని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి మంచి కథలున్నాయని, వాటన్నింటిని వెలికితీయాలని అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా ప్రస్థానంపై ప్రముఖ సినీ విశ్లేషకులు తెలకపల్లి రవి రచించిన మన సినిమాలు పుస్తకాన్ని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో నటుడు, రచయిత తనికెళ్ల భరణి, రావి కొండలరావు, పరిచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రెంటాల జయదేవ్‌తో కలిసి పవన్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని రావి కొండలరావుకు అందజేశారు. మహానటి చిత్రం ఎంతో మందికి ప్రేరణ కలిగించిందన్నారు. అలాంటి సినిమాలు మరిన్ని రావాలని పవన్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: గాయని సునీత క్రష్ ఇతడే..