ETV Bharat / city

KCR Flexi in AP: ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ.. ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ.. - KCR Flexi in AP

KCR Flexi in AP: ఏపీలోని పవన్‌కల్యాణ్‌ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. విజయవాడలో పవన్‌ అభిమానులు ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలతో ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫొటో కూడా ఉండటం గమనార్హం.

KCR Flexi in AP
KCR Flexi in AP
author img

By

Published : Feb 26, 2022, 11:26 AM IST

KCR Flexi in AP: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. భీమ్లానాయక్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ.. విజయవాడలో కృష్ణలంకకు చెందిన పవన్‌కల్యాణ్‌ అభిమానులు ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలతో ఉన్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీపై మరోవైపు వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ చిత్రాలు ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ..

KCR Flexi in Vijayawada: మరోవైపు ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్‌కల్యాణ్‌ అభిమానులు భగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన భీమ్లానాయక్‌ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన రాష్ట్రంలోని 15 థియేటర్లను వాటి యాజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో అయిదు థియేటర్లలో ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో ఏడు థియేటర్లలో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. టికెట్‌ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లానాయక్‌ పోస్టర్‌పైనా తహసీల్దార్‌ ఫోన్‌ నంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు.

మంత్రులకు చేదు అనుభవం

తమ అభిమాన హీరోపై కక్షసాధిస్తూ, ఆయన సినిమా వేసే సినిమా హాలు ప్రారంభానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ పవన్‌కల్యాణ్‌ అభిమానులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఎదుట నినాదాలు చేశారు. వీరు గుడివాడలో జీ3 సినిమా కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి శుక్రవారం వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అభిమానులను చెదరగొట్టి, కొందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కొత్త సినిమా కాంప్లెక్స్‌లో భీమ్లానాయక్‌ చిత్రాన్ని మంత్రులిద్దరూ కొద్దిసేపు చూసి వెళ్లారు. తగ్గించిన టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని మైలవరంలో రెండు థియేటర్లను మూసేశారు. తిరువూరులోని నాలుగు థియేటర్లలో, నందిగామలోని మరో థియేటర్‌లో భీమ్లానాయక్‌కి బదులు వేరే చిత్రాలు ప్రదర్శించారు. ఉయ్యూరు, కైకలూరు, ముదినేపల్లెలో కొన్నిచోట్ల మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లానాయక్‌ చిత్రాన్ని వేశారు. ప్రత్యేక ప్రదర్శన వేయాలని విస్సన్నపేట-తిరువూరు రహదారిలో పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తగ్గించిన ధరలకు చిత్ర ప్రదర్శన సాధ్యం కాదని కైకలూరులో ఒక థియేటర్‌ను మూసివేస్తుండగా... పవన్‌ అభిమానులు అడ్డుకున్నారు. గన్నవరంలో రెండు, హనుమాన్‌జంక్షన్లో మరో థియేటర్లలో సాంకేతిక కారణాల పేరుతో శుక్రవారం నుంచి ప్రదర్శన నిలిపివేశారు. విజయవాడ శైలజ థియేటర్‌ వద్ద పవన్‌ అభిమానులు ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలోని కమలా థియేటర్‌లో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినందుకు కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్‌ మాధవీలత థియేటర్‌ యాజమాన్యానికి రూ.50వేల జరిమానా విధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.