ETV Bharat / city

అన్నా రాంబాబు ఎలా గెలుస్తాడో చూస్తా : పవన్‌ - జనసేనాని పవన్ కల్యాణ్ తాజా వార్తలు

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో తమ కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఒంగోలులో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

pawan-kalyan-demands-to-punish-them-who-are-responsible-for-the-death-of-their-party-activist-vengayya-in-ongole
అన్నా రాంబాబు ఎలా గెలుస్తాడో చూస్తా : పవన్‌
author img

By

Published : Jan 23, 2021, 2:49 PM IST

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ..‘‘ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారు... కానీ, పేదల బతుకులు మాత్రం మారడం లేదన్నారు.

pawan-kalyan
వెంగయ్య మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎస్పీకి పవన్ వినతి

జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులతో సమావేశం ముగిసిన తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి పవన్‌ వినతి పత్రం సమర్పించారు. వెంగయ్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

డిసెంబరు 16న కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిపై వెంగయ్య ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎదురు దాడికి దిగడంతో కంగుతున్న జనసేన కార్యకర్త ఎమ్మెల్యేకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.