ETV Bharat / city

విదేశాలకు వెళుతున్నారా, ఇక మీకు ఆ ఇబ్బందులు లేనట్లే

Passport services విదేశాలకు వెళ్లే వారు పాస్​పోర్టు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాస్​పోర్టు సేవలను సులభతరం చేయడానికి శనివారం సైతం పాస్‌పోర్టు సేవాకేంద్రాలు పని చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

Passport services
పాస్​పోర్టు సేవలు
author img

By

Published : Aug 28, 2022, 8:23 AM IST

Passport services: విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త. ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు కేంద్రాలు సేవలు అందనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వారంలో ఐదు రోజులు మాత్రమే పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న వందల మంది సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు మూడు వారాల సమయం పడుతోంది.

ఈ సమస్యను ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్‌ దృష్టికి తీసుకెళ్లామని బాలయ్య వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం శనివారం సైతం పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆయన వివరించారని ప్రాంతీయ పాస్​పోర్టు అధికారి తెలిపారు. సెప్టెంబరు 3 నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేటతోపాటు నిజామాబాద్‌, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలు ప్రతి శనివారం పనిచేస్తాయని వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.