ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: పూర్తిగా నిలిచిపోయిన పాస్​పోర్టుల జారీ - తగ్గిన పాస్​పోర్ట్​ దరఖాస్తులు

ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కరోనా... విమానయాన రంగాన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్‌ కారణంగా రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీ మూడోవంతుకు పడిపోయింది. అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆగిపోవడం, ప్రజారవాణా లేకపోవడంతో... దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పడిపోయింది. రాష్ట్రంలో 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టుల జారీ కార్యకలాపాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

passport apllication decrease in telangana due to corona
కరోనా ఎఫెక్ట్: స్తంభించిన పాస్​పోర్టుల జారీ
author img

By

Published : Jun 19, 2020, 6:51 AM IST

రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. కొవిడ్‌ ప్రభావంతో మార్చి చివరి వారంలో మూత పడిన పాస్‌పోర్టు సేవా కేంద్రాలు... మే 6 నుంచి దశల వారీగా పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు అందించేందుకు పని చేస్తున్న 14 తపాలా కార్యాలయాలు ఇప్పటికీ తెరచుకోనేలేదు.

గతంలో రోజుకూ 700పాస్​పోర్టులు జారీ

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, టోలిచౌక్‌, బేగంపేటతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌లోని అయిదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు... రోజుకు దాదాపు రెండున్నర వేల పాస్‌పోర్టులు జారీ చేసేవి. వీటితో పాటు రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల నుంచి మరో 700 వరకు పాస్‌పోర్టులు జారీ అయ్యేవి. కాని కరోనా ప్రభావంతో సేవా కేంద్రాలు మూతపడడం వల్ల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది.

అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతేనే డిమాండ్

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మే 6 నుంచి పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఒక్కొక్కటిగా తెరచుకున్నాయి. మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడం వల్ల... దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రజారవాణా లేకపోవడం, అంతర్జాతీయ విమాన రాకపోకలు ఆగిపోవడం వల్లే పాస్‌పోర్టులపై ప్రజలు దృష్టిసారించడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు మూడో వంతు కూడా పాస్‌పోర్టులు జారీ కావడం లేదని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో ప్రజారవాణా పునరుద్ధరణ జరిగి, అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభమైతే... గతంలో మాదిరిగా సాధారణ పరిస్థితులు సంతరించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.