ETV Bharat / city

మెట్రోలో స్మార్ట్ రీఛార్జ్​లపై క్యాష్​బ్యాక్​ ఆఫర్ - మెట్రో ప్రయాణికులకు సువర్ణ ఆఫర్​

రద్దీని పెంచుకునేందుకు మెట్రో.. మరో ఆఫర్ ప్రకటించింది. గతల నెల ప్రకటించిన సువర్ణ ఆఫర్​ సక్సెస్​తో రేపటి నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ ఆఫర్​ వివరాలు వెల్లడించారు. రేపటి నుంచి రీఛార్జ్ చేసుకుంటే 50శాతం వరకు క్యాష్​ బ్యాక్ ఆఫర్​ వస్తుందని తెలిపారు.

passengers increase to hyderabad metro with suvarna offer
సువర్ణ ఆఫర్​తో మెట్రోకు పెరిగిన ప్రయాణికులు
author img

By

Published : Oct 31, 2020, 4:01 PM IST

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణాలకు నగర ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రతిరోజు మూడు కారిడార్లలో కలిపి ఇప్పుడు సరాసరి లక్ష 30 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇటీవల సువర్ణ ఆఫర్​లో భాగంగా ప్రయాణికులకు 40 శాతం రాయితీ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని చెప్పారు.

ఆదివారం నుంచి మెట్రో స్మార్ట్ రీఛార్జ్​లపై 50 శాతం వరకు క్యాష్​బ్యాక్ ఇచ్చే ఆఫర్ అమల్లోకి రానుంది. స్టేషన్లలో, ఆన్​లైన్​లో రీఛార్జ్​ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని... ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. స్మార్ట్ కార్డులో రీఛార్జ్​ చేస్తే వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులో జమ కానున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి: ప్రకృతి కవి, ఫొటోగ్రాఫర్​గా మారిన చిరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.