ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ అధికారుల్లో నెలకొన్న గందరగోళం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణాలు సాగించే వారు ఇరు రాష్ట్రాల సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్రం నుంచి హైదరాబాద్కు నేరుగా బస్సులు నడపని విషయం తెలిసిందే. ఫలితంగా.. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ నుంచి గరికపాడు చెక్ పోస్ట్ వరకు... తెలంగాణ ఆర్టీసీ రామాపురం వరకు బస్సులు నడుపుతున్నారు.
ఈ ఇరు గ్రామాల మధ్య కిలోమీటర్ దూరం ఎటువంటి బస్సులు నడపక పోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆటోలకు ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయని వాపోతున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకొని హైదరాబాద్ విజయవాడ మధ్య నేరుగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: 'కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి'