ETV Bharat / city

13 అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత.. ఇండియన్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు - ఇన్స్ఫిరేషనల్​ స్టోరీస్​

అట్టడుగు వర్గాలకు చదువే దిక్సూచిలా నిలుస్తుందని అతని నమ్మకం. విజ్ఞానమే వ్యక్తిగత అభివృద్ధితోపాటు.. సమాజ అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసం. చదవుపై ఉన్న మక్కువే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మరీ పుస్తకాలు పట్టేలా చేసింది. డిగ్రీలు స్థాయి దాటి పరిశోధనల దిశగా అడుగులు వేయించింది. ఏకంగా ఐదు పీజీలు, రెండు డాక్టరేట్లు, జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు సాధించేలా చేసి ఇండియన్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

passed-13-eligibility-tests-place-in-indian-book-of-records

author img

By

Published : Jul 30, 2021, 10:46 PM IST

13 అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత.. ఇండియన్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

పుస్తకాలతో కుస్తీ పడుతూ ఐదు పీజీలు, రెండు డాక్టరేట్లు, జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లు సాధించాడో యువకుడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బిరుదు రవిబాబుది పేద కుటుంబం. తండ్రి చెప్పులు కుడుతూ, తల్లి పాచిపనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. ఉన్నత చదువులు చదవాలనేది రవిబాబు ఆకాంక్ష. బోధనలో అత్యున్నత స్థానమైన ఆచార్యునిగా కొలువు సాధించాలనేది అతని లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులు ఎంతలా వేధిస్తున్నా..రవిబాబు లక్ష్యం మాత్రం వీడలేదు. కష్టపడి చదివి నాగార్జున విశ్వవిద్యాలయంలో పీజీ చేశాడు. అక్కడే మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు.

ఎంఎస్సీ ఆక్వాకల్చర్, జంతుశాస్త్రం, మైక్రోబయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంటెక్ బయోటెక్నాలజీ ఇలా ఐదు పీజీలు చదివాడు. పీజీ డిప్లొమా ఇన్ నానో బయోటెక్నాలజీతో పాటు.. జాన్ హప్ కిన్ విశ్వవిద్యాలయం, లీడ్స్ కీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులు పూర్తిచేశాడు. ఇష్టపడి చదవటం వల్ల ఎప్పుడూ కష్టం అనిపించలేదని రవిబాబు తెలిపాడు.

నెట్​, సెట్​, గేట్​ అన్నింట్లోనూ ఉత్తీర్ణత

ఆచార్యుడిగా పనిచేయాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరాలంటే ముందుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావాలి. రాష్ట్రస్థాయి లేదా జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అందుకోసం నెట్, సెట్, గేట్, అగ్రికల్చర్ నెట్ ఇలా అన్నింటిలోనూ ఉత్తీర్ణులయ్యాడు. యూజీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సీఎస్​ఐఆర్​ లైఫ్ సైన్సెస్​లో అర్హత సాధించాడు. అలాగే 2014లో యూజీసీ నెట్ - జూనియర్ రీసెర్చ్ ఫెలో - ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లోనూ గట్టెక్కాడు. ఏపీ సెట్​లో లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులో మూడుసార్లు క్వాలిఫై అయ్యాడు. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లోనూ ఉత్తీర్ణత సాధించాడు. ఏఎస్​ఆర్​బీ నెట్ - ఆక్వాకల్చర్ రెండుసార్లు, యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టు రెండుసార్లు, అగ్రికల్చరల్ నెట్ - ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో ఓసారి క్వాలిఫై అయ్యాడు. గేట్ పరీక్షల్లో ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జువాలజీ, ఎవల్యూషన్, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులకు అర్హత సాధించాడు. ఇలా 13 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దేశంలో మరెవ్వరూ లేరు. ఇదే రవిబాబుని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​కు ఎంపిక చేసింది.

25 పరిశోధనా పత్రాలు రూపొందించిన రవిబాబు

ఐదు సబ్జెక్ట్‌ల్లో పీజీతో సరిపెట్టుకోకుండా బయోటెక్నాలజీలో మొదటి పీహెచ్​డీ పూర్తి చేసిన రవిబాబు.. జువాలజీ అండ్ ఆక్వాకల్చర్‌లో చేస్తున్న రెండో పీహెచ్​డీ తుది దశలో ఉంది. చదువు, పరిశోధనలు చేసే క్రమంలో స్కాలర్ షిప్పులతో పాటు కొన్ని అవార్డులు సాధించాడు. ఇప్పటి వరకూ 250 వెబినార్స్​కు హాజరు కావటంతో పాటు 25 పరిశోధనా పత్రాలు రూపొందించాడు.

ఇదీ చదవండి: Venkaiah naidu: 'భారత్‌ బయోటెక్‌ మనదేశానిది కావడం గర్వంగా భావిస్తున్నా​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.