ఖతర్‌లో ఐసీసీ ఆధ్వర్యంలో భారతీయ ఎంబసీ పర్యవేక్షణలో ప్యాసెజ్ టూ ఇండియా ప్రవాస భారతీయుల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖతర్‌లో పనిచేస్తున్న భారతీయులు, స్థానిక అరబ్బులు, ఇతర జాతీయుల సమక్షంలో తెలుగు రాష్ట్రాల కళలు, సంస్కృతి ఈ ఉత్సవాలల్లో ప్రతిబింబించింది.
ఖతర్, భారత్ 2019 మైత్రి సంవత్సరం ముగింపుగా వైభవంగా జరిగిన ఇండియా పాసెజ్ కార్యక్రమం ఖతర్‌లోని భారతీయులను అలరించింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ కార్యక్రమాలను ఈ ఉత్సవాలలో ప్రదర్శించారు.
తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి పోటాపోటీగా ప్రదర్శించిన జానపాద గేయాలు, బంజారా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దిల్లీలోని ఎర్రకోట నమూనాను సభా ప్రాంగణంలో అమర్చగా అరబ్బులతో పాటు సందర్శకులూ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.
- ఇదీ చూడండి : ఇరాక్: అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి