ETV Bharat / city

కోళ్లకు అందాల పోటీలు..ఎక్కడో తెలుసా..! - Parla breed chicken

కాలికి కత్తి కట్టి... బరిలో దిగి... పౌరుషంతో పోరాటం చేస్తే అది సంక్రాంతి పందెంకోడి. నున్నగా తల దువ్వుకుని... చక్కగా ముస్తాబై... వయ్యారంగా నడుస్తూ అందాల కిరీటాన్ని గెలుచుకుంటే... అది పర్లా కోడి. ‘కోడికి అందాల పోటీనా’ అని ఆశ్చర్యపోతున్నారా...అయితే కచ్చితంగా పర్లా కోడి గురించి తెలుసుకోవాల్సిందే!

parla breed chickens, parla hens
పర్లా జాతి కోడి, పర్లా కోళ్లు
author img

By

Published : Apr 18, 2021, 1:37 PM IST

ర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ఊళ్లలో మనం చూసే కోళ్ల కన్నా ప్రత్యేకంగా ఉంటాయి. చిలక ముక్కులాంటి ముక్కు, నెమలి పింఛంలాంటి తోక, పొడవైన శరీరం, చూడముచ్చటైన రూపంతో రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ అందచందాలే వీటి ధరను నిర్ణయించేస్తుంటాయి. అందాల పోటీల్లో విజేతగా నిలబెట్టేస్తుంటాయి.

పర్లా జాతి కోళ్లు

దీని డైటే.. సెపరేటు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో చాలామంది ఈ కోళ్లను పెంచుతున్నారు. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ‘ఏటా జరిగే అందాల పోటీల్లో నా దగ్గరున్న కోళ్లు బహుమతులు తెచ్చిపెడుతున్నాయి’ అంటూ ఆనందంగా చెబుతారాయన. అందాల కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి చాలా ప్రత్యేక పద్ధతులే ఉంటాయి. కోడి అందమైన ఆకృతి కోసం ప్రత్యేకమైన డైట్‌ ప్లాన్‌ ఉంటుందట. రోజూ ఉదయాన్నే కోళ్లకు వ్యాయామం చేయించడం, ఈత కొట్టించడంలాంటివి చేస్తారు. పొద్దున్నే బాదం పప్పు, నల్ల ఖర్జూరం, వాల్‌నట్స్‌, ఎండు ద్రాక్ష, సాయంత్రం రాగులు, సజ్జలు ఆహారంగా వేస్తారు. మల్టీవిటమిన్స్‌ను నీళ్లలో కలిపి అందిస్తారు. ‘అది సరే కానీ, ఇంతకీ వీటిని ఎవరు ఎలా కొంటున్నారబ్బా...’ అనే సందేహం వచ్చే ఉంటుంది కదూ! ఈ పర్లా కోళ్ల అమ్మకాలు ఆన్‌లైన్లో జరుపుతారు. వీటిపేరుతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఖాతా ల్లాంటివి ఏర్పాటుచేసుకుని, ఆసక్తి ఉన్నవాళ్లు అందులో సభ్యులవుతారు. ఆ గ్రూపుల్లో కోళ్ల ఫొటోలు ఉంచగానే నచ్చినవారు బేరం ఆడేసి కొనుక్కుంటారు. కోడి రూపురేఖల్ని బట్టి ఒక్కోదాని ధర మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ పలుకుతుందట.ఒక కోడి ఏడాదికి 35 వరకు గుడ్లు పెడుతుంది. ఒక గుడ్డు రేటు దాదాపు వెయ్యి రూపాయలుంటుంది.

దీని డైటే.. సెపరేటు!

అందాల పోటీలు!

ఇంతకీ ఈ కోళ్ల అందాల పోటీలు ఎక్కడ జరుగుతాయంటే... తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్‌, సేలం, మదురై, తిరుచ్చి, చెన్నై లాంటి చోట్ల. ప్రత్యేకమైన కోళ్ల జాతుల్ని పెంచే కొందరు పెంపకందారులు ‘ఆలిండియా అస్లీస్‌’ అనే క్లబ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ఆధ్వర్యంలో 2014 నుంచి ఈ అందాల పోటీల్ని జరుపు తున్నారు. ఏటా జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ‘అందాల తోక నాదేనూ... మెరిసేటి రంగు నాదేనూ’ అంటూ ఇంచుమించు రెండు వేల కోళ్లు ఈ పోటీలో పాల్గొంటాయి. అందాలపోటీల్లానే ఇక్కడా న్యాయనిర్ణేత లుంటారు. కోడి ముఖకవళికలు, కళ్లు, ముక్కు, మెడ, రెక్కలు, కాళ్లు, తోక, నిలబడే విధానం, ఒడ్డూ పొడుగూ.. అన్నీ చూసి మార్కులు వేస్తారు. వచ్చిన వందలాది కోళ్లలో మొదటి బహుమతికి పదికోళ్లను, రెండో బహుమతికి 30 కోళ్లను ఎంపిక చేసి బహుమతులు ఇస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.