ETV Bharat / city

ఏపీ హైకోర్టులో పరిషత్​ ఎన్నికలపై విచారణ - AP Political Updates

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై ఆ రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ap parishad elections
ఏపీ హైకోర్టులో పరిషత్​ ఎన్నికలపై విచారణ
author img

By

Published : Apr 15, 2021, 9:02 AM IST

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు గురువారం విచారణ జరపనున్నారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందంటూ.. సింగిల్ జడ్జి వద్ద వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... ఈ నెల 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ... ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీల్​పై 7వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం... 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది. ఓట్ల లెక్కింపు పక్రియ నిలుపుదల చేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే విషయాన్ని సింగిల్ జడ్డికి అప్పగించింది. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్డి వ్యాజ్యాన్ని ఈ నెల 15కు వాయిదా వేశారు. 15న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ జరగనుంది.

ఇవీచూడండి: కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.