ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురంలోని నింకంపల్లి ప్రాంతానికి చెందిన సమ్రీన్, మహబూబ్పాషా దంపతులు నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. ఆ చిన్నారిని సమీప బంధువులకు రూ.20 వేలకు విక్రయించారు.
బిడ్డ కనిపించకపోవటాన్ని గమనించిన స్థానికులు ఆ దంపతులను నిలదీయగా... శిశువును విక్రయించినట్లు అంగీకరించారు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు దంపతులను విచారించి, బెంగళూరులో ఉన్న శిశువును తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: బీమా మోసం.. రూ.8 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు