ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురంలో మక్బుల్ జాన్, అయూబ్ ఖాన్ల కుమార్తె రూబియా. ఫిలిప్పీన్స్ దేశంలోని దావోస్ సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ప్రభుత్వం నుంచి విదేశీ విద్య స్కాలర్షిప్ వస్తుందన్న ధైర్యంతో కుమార్తెను అంత దూరం పంపించారు. ఒకవేళ అది రాకపోతే.. తమకున్న ఇల్లు తాకట్టు పెట్టైనా.. లేకుంటే విక్రయించైనా.. చదివించాలని అనుకున్నారు.
తాము ఒకటి తలస్తే.. దైవం ఒకటి తలచిందనే విధంగా.. విదేశీ విద్య స్కాలర్షిప్ పథకం అమలు కాకపోవటం.. ఫీజులు కట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకుండా పోయింది. ఉన్న ఇల్లు అమ్ముదామంటే.. నిబంధనలు అడ్డొచ్చాయి. దిక్కుతోచని పరిస్థితిలో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తన కుమార్తె చదువు కోసం.. ఆ తల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. దీంతో తహసీల్దార్ కల్పించుకుని సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి.. చేతులు దులుపుకున్నారు. చేసేదేమీ లేక.. తమ కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకుంది రుబియా తల్లి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ వేడుకుంటోంది. లేకుంటే కనీసం తమ కుమార్తె విద్య కోసం.. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా సినీ పెద్దలు