ETV Bharat / city

'ఎందుకు ఈ దుస్థితి... ఎవరిది ఈ నేరం..?' - Amaravati latest news

"రాజధాని విషాదం - అమరావతి" పేరుతో 60 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ రూపొందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రివ్యూ థియేటర్​లో ఆ డాక్యుమెంటరీని విడుదల చేశారు. సరైన పరిష్కారం కోసమే తాను రాజధాని విషాదం డాక్యుమెంటరీని రూపొందించినట్లు చెప్పారు.

ap amaravathi
ap amaravathi
author img

By

Published : Dec 6, 2020, 9:31 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. రాజధాని ఎక్కడుందో తెలియని దిక్కుతోచని స్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు, ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీసలహాదారు పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి రాజధాని కోసం అన్వేషణలే తప్ప ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు ఆలోచించడం లేదన్నారు. అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత పాలకుల మధ్య వివాదాలు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆర్తనాదాలు, మూడు రాజధానుల విషయంలో దక్షిణాఫ్రికా సమీక్షలను ప్రస్తావిస్తూ.. "రాజధాని విషాదం - అమరావతి" పేరుతో 60 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని పరకాల ప్రభాకర్ రూపొందించారు.

హైదరాబాద్​లోని ఓ ప్రివ్యూ థియేటర్​లో ఆ డాక్యుమెంటరీని ప్రభాకర్ విడుదల చేశారు. పలువురు మేథావులు, రాజకీయ ప్రముఖులు, సామాజిక విశ్లేషకులు వీక్షించారు. రాజధాని విషయంలో సమగ్రమైన అధ్యయనం, సరైన పరిష్కారం కోసమే తాను రాజధాని విషాదం డాక్యుమెంటరీని రూపొందించినట్లు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

'ఎందుకు ఈ దుస్థితి... ఎవరిది ఈ నేరం..?'

ఇదీ చదవండి: కొడుకులు చూస్తుండగానే తల్లి ఆత్మహత్య... కారణమేంటీ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.