ETV Bharat / city

Roads: ' దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయండి' - తెలంగాణ వార్తలు

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంత్రి సమీక్ష నిర్వహించారు.

errabelli dayakar rao
ఎర్రబెల్లి దయాకర్ రావు
author img

By

Published : Sep 8, 2021, 5:02 PM IST

Updated : Sep 8, 2021, 10:06 PM IST

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్​ రోడ్లకు మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్​లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదార్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు ఖాళీలకు అనుగుణంగా పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీర్లకు కూడా పదోన్నతులు కల్పించాలన్న మంత్రి... అందుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. కారోబార్లు, పంపు మెకానిక్​ల స‌మ‌స్యలను పరిశీలించి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వెంట‌నే ప‌రిష్కరించాలని ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న కొన్ని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులు గుంతల మయంగా మారాయి. పంచాయతీరాజ్​ రోడ్లే కాకుండా జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై ఇప్పటికీ నీరు నిలిచి ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్లకు మరమ్మతులు చేయటంతో పాటు పలు చోట్ల నూతన వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Tamilisai : ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: గవర్నర్

Last Updated : Sep 8, 2021, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.