ETV Bharat / city

మావోయిస్టులకు వ్యతిరేకంగా పల్లెల్లో కరపత్రాలు - vishaka agency latest news

మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఏజెన్సీ మారుమూల గిరి పల్లెల్లో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఇన్​ఫార్మర్ల పేరుతో అమాయకులను బలి చేయడాన్ని తప్పుపట్టారు. సంబంధం లేని వ్యక్తులను చంపడంపై ప్రశ్నిస్తూ.. ఇటువంటి చర్యలకు ఆదివాసీలు బెదరక అంతిమంగా విజయం సాధిస్తారని కరపత్రాల్లో ముద్రించారు.

pamplets-in-vishaka-agency-areas-against-maoist-actions-challanging-by-villagers-that-final-win-will-be-of-adivasis
మావోయిస్టులకు వ్యతిరేకంగా పల్లెల్లో కరపత్రాలు
author img

By

Published : Dec 28, 2020, 10:49 PM IST

మావోయిస్టులకు వ్యతిరేకంగా రహదారులపై కరపత్రాలు దర్శనమిచ్చాయి. మావోయిస్టు లారా మీ రక్త దాహానికి ఇంకెంత మంది బలి కావాలంటూ.. ఇటీవల ఇన్ఫార్మర్ నెపంతో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు, అతని మిత్రుల పేరు మీద ఈ కరపత్రాలు ప్రచురతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం మద్ది గరువు, వాకపల్లి, సూరిమెట్ట, మండిబ, సుబ్బులు, పులుసు మామిడి, నుర్మతి గ్రామాల రహదారులపై మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు పడి ఉన్నాయి.. వీటిలో మావోయిస్టులను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లుగా ముద్రించబడ్డాయి. వీటిలో కొన్ని ముఖ్య అంశాలతో మావోల చర్యలపై ప్రశ్నలు సంధించారు.

అమాయకులను బలిచేస్తున్నారు?

గెమ్మెలి కృష్ణారావు హత్యకు రామగుండం ఎన్కౌంటర్ కారణమా? ఎక్కడ రామ్ గూడా? ఎక్కడ వాకపల్లి? ఎప్పుడో 2016 లో జరిగిన ఎన్ కౌంటర్​ గురించి.. ఎవడో బొల్లి అనేవాడు చెబితే, ఇప్పుడు 2020 లో మా గ్రామస్తులను చంపుతారా?... గడిచిన నాలుగేళ్ల కాలంలో 25 మంది అమాయకులను ఇలాగే ఎన్​కౌంటర్లకు కారణమంటూ నింధించి చంపేశారు.. మరి వాళ్లంతా అమాయకులా?.. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మా ఊరి వ్యక్తిని అదేకారణంతో హతమార్చారు? అసలు ఇది నమ్మేలా ఉందా! సరైన కారణాలు దొరకక ఇప్పుడు రామ్ గూడ ఖాతాలో వేశారా? అంటూ మావోలను గ్రామస్తులు కరపత్రంలో ప్రశ్నంచారు.

మీ చర్యలకు మృతుని కుటుంబం ఏం కావాలి?

ఇన్​ఫార్మర్ల నెపంతో మీరు చంపిన వ్యక్తి భార్య, నలుగురు పిల్లల పరిస్థితి ఏమిటి? అంటూ కరపత్రాల్లో ప్రశ్నించారు. మీ వల్ల రోడ్లు లేవు, ఫోన్​లు లేవు, ఆసుపత్రులు లేవు, ఉద్యోగాలు లేవు, పనులు లేవు.. జీవనాధారం కోసం కృష్ణారావు అనే గ్రామస్తుడు వీఎస్​ఎస్​ లో పని చేసుకుంటుంటే తప్పని చంపేశారు. భవిష్యత్తులో అతని భార్య నలుగురు పిల్లల్ని ఏమి పెట్టి పోషించాలి? మృతుని భార్య అడుగుతున్న ప్రశ్నకు మీ పార్టీలో ఎవరు సమాధానం చెబుతారు? ఏమని సమాదానం చెబుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చంపే ముందు ప్రజల ముందుకు ఎందుకు తీసుకు రాలేదు? ఎందుకు ప్రజాకోర్టు పెట్టలే?

వాకపల్లి మహిళలు బెదిరించాడా? అరెస్టు చేయించడా?.. వాకపల్లిలో మహిళలు అడ్డుకున్నాడని, బెదిరించాడని ఊర్లో వాళ్ళని అరెస్టు చేయించారని ఆరోపించారు ... అదే జరిగితే గ్రామంలో ఎందుకు ప్రజాకోర్టు పెట్టలేదు? ప్రజలకు ఆధారాలు ఎందుకు చూపించలేదు? చంపే ముందు ప్రజల ముందుకు ఎందుకు తీసుకు రాలేదు? అర్ధరాత్రి బందిపోటు దొంగలు వచ్చి చంపేశారా? మీ పార్టీ నాయకులు నేరాలు-ఘోరాలు బయటపడతాయని భయంతో చంపేశారా? అని మావోలను నిలదీశారు.

ఆదివాసి శవాల గుట్టల మీద మీ విప్లవ రాజ్యం తెద్దామనుకుంటున్నారా?.. అది కుదరదు

ప్రజా కోర్టులో ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రజలు కృష్ణారావును ప్రజాద్రోహిగా నిర్ణయించారు? ఏ ప్రజలు కృష్ణారావును మరణశిక్ష విధించమని చెప్పారు? మీ ఉద్యమానికి సహకరించిన వాళ్ళని బెదిరించమరి ఏ ప్రజలు చెప్పారు? రక్తపాతం సృష్టిస్తూ శవాల గుట్టలతో ఊళ్లను వల్లకాడుగా చేస్తూ హత్యలు చేస్తున్నారు? గిరిజన జీవితాలతో ఆడుకోవడం, బెదిరింపులకు హిట్ లిస్ట్ పేరుతో కరపత్రాలు ముద్రించడం అలవాటుగా మార్చుకున్నారని మండిపడ్డారు. మా ఆదివాసి శవాల గుట్టల మీద మీ విప్లవ రాజ్యం తెద్దామనుకుంటున్నారా?హత్యలతో దాడులతో మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా.. మీ ఆటలు సాగవు. ఎన్ని కరపత్రాలు ముద్రించి బెదిరింపులకు దిగినా అంతిమ విజయం ప్రజలదే.. మా ఆదివాసీలదే.. అంటూ గెమ్మెలి కృష్ణారావు మిత్రులు పేరుతో ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఆ ఊర్లో అంతుచిక్కని వ్యాధి... 20 రోజుల్లో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.