ETV Bharat / city

transport: 'అడ్డామీద లారీలను అధికారులు లాక్కెళుతున్నారు' - తెలంగాణ తాజా వార్తలు

ధాన్యం రవాణాకు లారీలను తీసుకెళ్లడంపై యాజమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. తాము వివిధ పనుల కోసం వినియోగిస్తున్న లారీలను..... అధికారులు బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ధాన్యం రవాణాకు తీసుకెళ్లిన లారీలను.... వారంపది రోజులైనా తిప్పిపంపడం లేదని వాపోతున్నారు. ఒకేపనికి అన్ని రోజులు లారీలను అట్టిపెట్టుకోవడం వల్ల.... నెలనెలా ఈఎమ్ఐ(EMI)లు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

lorry
ధాన్యం రవాణాకు లారీలు
author img

By

Published : May 29, 2021, 4:16 AM IST

'అడ్డామీద లారీలను అధికారులు లాక్కెళుతున్నారు'

లక్షలు పెట్టి లారీలు కొని నడుపుకుందాం అనుకున్న యజమానుల ఆశలు అడియాశలవుతున్నాయి. ఒక్కో లారీని 30 నుంచి 35లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. గత ఏడాది లాక్‌డౌన్(lockdown) వల్ల అరకొరగానే లారీలు నడిచాయి. ప్రస్తుతం మరోసారి లాక్‌డౌన్(lockdown 2.0) పరిస్థితుల్లో సరుకు రవాణా అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 50వేల పైచిలుకు లారీలున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే (ghmc) సుమారు 40వేల లారీలు సరుకు రవాణా చేస్తున్నాయి. వీటితోపాటు కొందరు టీఎస్​ఎమ్​డీసీ (TSMDC) దగ్గర ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఇసుక బుక్(sand booking) చేసుకుని రవాణా చేస్తుంటారు. ధాన్యం రవాణా చేసేందుకు వాహనాలు సరిపోకపోవడంతో.. పౌరసరఫరాలశాఖ(civil supply department) అధికారులు అడ్డాలపై దొరికిన లారీలను తీసుకెళ్తున్నారు. వాటిని ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నారు. లారీలను లాక్కెళ్లిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని యజమానులు వాపోతున్నారు

ఒక నెల కిస్తీ కట్టకపోయినా..

తాము ఏదో ఒక పనిలో పెట్టిన లారీలను అధికారులు తీసుకెళ్లి... ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నారని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా తీసుకెళ్లిన లారీలను వారం పదిరోజుల పాటు అక్కడే పెట్టుకుంటున్నారని వాపోతున్నారు. రోజుల తరబడి అక్కడే పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. లారీలతోపాటు అక్కడే ఉండి డ్రైవర్లు పని చేస్తున్నారని... వారి కుటుంబసభ్యులేమో తమ ఇంటికి వచ్చి ఎప్పుడు పంపిస్తారని ప్రశ్నిస్తున్నారని... యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలకు నెలకు లక్ష వరకు కిస్తీలు కట్టాల్సి వస్తోందని... వీటికితోడు రోడ్డు, బీమా పన్నులు... డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు, మరమ్మతులకు ఖర్చులు వెరసి తడిసి మోపెడవుతోందన్నారు. ఒక నెల కిస్తీ కట్టకపోయినా ఫైనాన్షియర్లు లారీలను లాక్కెళతారని ఆందోళన వ్యక్తం చేశారు.

మేము వ్యతిరేకం కాదు..

ప్రభుత్వానికి, రైతులకు తాము వ్యతిరేకం కాదన్న లారీ యజమానులు... అకారణంగా వాహనాలు తీసుకెళ్లి తమను రోడ్డుపాలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'కొవిడ్ రోగుల్లో మరణాలకు కారణమిదే..!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.