ETV Bharat / city

బీఏ, బీకాం, బీబీఏ కోర్సులకు పరీక్షల షెడ్యూల్​ విడుదల - bba exams time table

బీఏ, బీకాం, బీబీఏ కోర్సుల మొదటి, రెండో సంవత్సర విద్యార్థుల పరీక్షల షెడ్యూల్​ను ఓయూ విడుదల చేసింది. నవంబర్​ 23 నుంచి జనవరి 3 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల సమయంలో కొవిడ్​ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

పరీక్షల షెడ్యూల్​ విడుదల
పరీక్షల షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Nov 13, 2020, 5:44 PM IST

బీఏ, బీకాం, బీబీఏ కోర్సుల మొదటి, రెండో సంవత్సర విద్యార్థుల పరీక్షల షెడ్యూల్​ను ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ పరీక్షలు నవంబర్​ 23 నుంచి మొదలై... జనవరి 3 వరకు కొనసాగనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. బీఏ కోర్సులోని మొదటి, రెండో సంవత్సర విద్యార్థుల పరీక్షలు నవంబర్​ 23 నుంచి డిసెంబర్​ 3 వరకు కొనసాగగా... బీకాం విద్యార్థులకు నవంబర్​ 29 వరకు, బీబీఏ విద్యార్థుల పరీక్షలు నవంబర్​ 28 వరకు జరగనున్నట్లు తెలిపారు.

కొవిడ్​ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సంవత్సరం విద్యార్థలకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదింటి వరకు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఏలాంటి సందేహాలున్నా... https://www.ouexams.in/examnotifications లింకును సంప్రదించాల్సిందిగా అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: పీఈసెట్​లో ప్రతిభ చాటుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.