మొన్నటిదాకా తమతో ఉన్న నాన్న ఇప్పుడు లేకపోయేసరికి.. ఆ పిల్లలు అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. వారి అమ్మ.. మూడు నెలల క్రితం చనిపోగా.. అన్నీ తానయ్యాడు ఆ తండ్రి. ఇప్పుడు ఆయన కూడా దూరం కావడంతో పిల్లలు అనాథలుగా మారారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరు ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం, ఈశ్వరమ్మ దంపతులకు హరిప్రసాద్ (14), హేమంత్ (12) ఇద్దరు సంతానం. మూడు నెలల క్రితం అనారోగ్యంతో ఈశ్వరమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన సుబ్రమణ్యం నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
బుధవారం సాయంత్రం గ్రామ పొలిమేరల్లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. వీరికి సొంతిల్లు లేదు. తెలిసిన వారి ఇంట్లో ఇంతకాలం తలదాచున్నారు. ఇక వారిద్దరూ లేక.. ఇద్దరి చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారింది. తండ్రి మృతదేహం వద్ద బిక్కుబిక్కుమంటూ కనిపించిన ఆ ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికుల మనసు చలించిపోయింది.
ఇదీ చూడండి: