ETV Bharat / city

Organ transplant surgeries : ఇక నుంచి జిల్లాల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు - జీవన్ దాన్ ట్రస్టు

Organ transplant surgeries : ఇప్పటి వరకు హైదరాబాద్​కే పరిమితమైన అవయవ మార్పిడి చికిత్సలను ఇక నుంచి జిల్లాలకు విస్తరించేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్​దాన్ ట్రస్టు దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించే వీలుందని.. అవయవదానంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలని జీవన్​దాన్ ట్రస్ట్ చెబుతోంది. ప్రభుత్వ వైద్యులకు దీనిపై అవగాహన కల్పించి.. వైద్యకళాశాలల్లోని అనుబంధ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది.

Organ transplant surgeries
Organ transplant surgeries
author img

By

Published : Feb 16, 2022, 8:42 AM IST

Organ transplant surgeries : రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన అవయవ మార్పిడి చికిత్సలను జిల్లాలకు విస్తరించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవన్‌దాన్‌ ట్రస్టు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాల్లోని ఆసుపత్రుల వైద్యులకు దీనిపై అవగాహన కల్పించింది. ముఖ్యంగా వైద్య కళాశాలల్లోని అనుబంధ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలకు శ్రీకారం చుట్టాలని యోచిస్తుంది.

4-7 గంటల్లోగా అమర్చితేనే..

Organ transplant surgeries in Telangana : ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అవయవ మార్పిడి చికిత్సలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి గతేడాది డిసెంబరు వరకు 956 మంది దాతల నుంచి అవయవాలను సేకరించి 3,,629 మార్పిడి చికిత్సలు చేశారు. ఇందులో ఎక్కువ శాతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల లేమి ఇతర కారణాలతో ఈ చికిత్సలు సాగడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అవయవదానానికి సాయం అందడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉస్మానియా, నిమ్స్‌లో కూడా ఊపందుకున్నాయి. ప్రమాదాలు, ఇతరత్రా కారణాలతో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవదానానికి అంగీకరించేలా జీవన్‌దాన్‌ ట్రస్టు కృషి చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ వైద్య కళాశాలల్లోని అనుబంధ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా దాత నుంచి అవయవాలు సేకరించి గ్రహీతకు 4-7 గంటల్లోపు అమర్చాలి. లేదంటే అవయవం పనితీరు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ లాంటి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు అవయవాల తరలింపు కొంత క్లిష్టతతో కూడుకున్నదే. అదే సమీపంలోని ఆసుపత్రుల్లోనే అర్హులైన వారికి అమర్చడం ద్వారా విలువైన కాలం కలిసివస్తుందని భావిస్తున్నారు.

మౌలిక వసతులు సమకూర్చుకోవాలి

డా.స్వర్ణలత, సమన్వయకర్త, జీవన్‌దాన్‌ ట్రస్టు

jeevan dan Trust : అవయవ మార్పిడి చికిత్సలపై ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు ఇటీవల అవగాహన కల్పించాం. త్వరలో శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇందుకోసం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. ఒక్కో వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించే వీలుంది. అవయవదానంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి.

- డా.స్వర్ణలత, సమన్వయకర్త, జీవన్‌దాన్‌ ట్రస్టు

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.