ETV Bharat / city

విమర్శలు గుప్పిస్తూ.. వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. - mlc elections news

అధికార తెరాసకు దీటుగా విపక్షాలు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై ప్రశ్నలు లేవనెత్తుతూ... ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

graduate mlc elections
విమర్శలు గుప్పిస్తూ.. వైఫల్యాలను ఎత్తిచూపుతూ..
author img

By

Published : Mar 7, 2021, 9:13 AM IST

విమర్శలు గుప్పిస్తూ.. వైఫల్యాలను ఎత్తిచూపుతూ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఎదుర్కొనేందుకు విపక్షాలు శ్రమిస్తున్నాయి. ఓట్ల వేటలో వెనకబడిపోకుండా... అధికార పక్షంతో సై అంటే సై అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. గులాబీ నేతలపై విమర్శలు గుప్పిస్తూ... హామీల అమలు, కొలువుల భర్తీపై నిలదీస్తున్నాయి.

భాజపా విస్తృత ప్రచారం..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు.... నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడే వ్యక్తి అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నాగర్‌కర్నూలులో నిర్వహించిన ప్రచారంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి ఓటు వేసిన ప్రతి ఒక్కరు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని డీకే అరుణ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు.

ప్రజలకు అన్యాయం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆక్షేపించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర సర్కారు.... విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం... రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక నేతలతో కలిసి ఉత్తమ్‌ ప్రచారం నిర్వహించారు. తెరాస, భాజపా నేతల మాయమాటలకు మోసపోకుండా తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నాగర్‌ కర్నూలులో కోరారు.

ప్రశ్నించే వారినే..

నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచించారు. మహబూబ్‌నగర్‌ కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రమణకు మద్దతుగా..

తెదేపా అభ్యర్థి ఎల్​.రమణకు మద్దతుగా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ స్థానంలో ప్రొఫెసర్‌ కోదండరాంను గెలిపించాలని తెదేపా నాయకులు ఖమ్మంలో ప్రచారం చేశారు. యాదాద్రి భువనగిరిలో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి శ్యామల వేణు ఓట్లు అభ్యర్థించారు.

ఇవీచూడండి: హోరాహోరీ పోరులో.. తెరాస ప్రచార జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.