ETV Bharat / city

ఫ్యాన్సీనంబర్లకు "ఆన్‌లైన్‌" వేలం - Telangana Fancy numbers auction latest news

రాష్ట్ర యంత్రాగం రవాణాశాఖలో పారదర్శకతకు చర్యలు చేపట్టింది. ఫ్యాన్సీనంబర్లను ఆన్‌లైన్‌లో వేలంవేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. టెండర్ల విధానానికి స్వస్తిపలికి.. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పారదర్శక, ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫ్యాన్సీనంబర్లకు "ఆన్‌లైన్‌" వేలం
ఫ్యాన్సీనంబర్లకు "ఆన్‌లైన్‌" వేలం
author img

By

Published : Dec 15, 2019, 5:39 AM IST

వాహనాల ఫ్యాన్సీనంబర్లకు పారదర్శకత తెచ్చేందుకు ఆన్‌లైన్‌లో వేలంవేసే ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయించింది. నాలుగైదు ఏళ్లుగా ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గడిచిన మూడేళ్లలో వేలం ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

ఫ్యాన్సీనంబర్లకు "ఆన్‌లైన్‌" వేలం

గడిచిన మూడేళ్లలో వేలం ప్రక్రియ

  1. 2016-17లో 35.54 కోట్లు, 2017-18లో 48.04, 2018-19లో రూ.55.59 కోట్ల ఆదాయం వచ్చింది.
  2. గత ఆర్థిక సంవత్సరంలో 72,902 మంది వాహనదారులు ఫ్యాన్సీనంబర్లు కొనుగోలు చేశారు.
  3. రాష్ట్రం మొత్తంమీద ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఉన్న డిమాండు మరెక్కడాలేదు.
  4. ఈ కార్యాలయం పరిధిలో 09తో ప్రారంభం కావటం సహా, వీవీఐపీలు, ప్రధాన కార్యాలయాలు ఆ ప్రాంతంలో ఉండటం వల్ల డిమాండు ఉంటోంది.

ఎవరు ఎక్కువ చెల్లిస్తే... వారికే ఫ్యాన్సీనంబర్
ప్రస్తుతం ఫ్యాన్సీనంబర్లు కోరుకునేవారు టెండర్ల తరహాలో నిర్ణీత మొత్తం డీడీ రూపంలో తీసి రవాణాశాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేస్తారు. ఆ నంబర్లకు ఒకరికన్నా ఎక్కువమంది ఆసక్తి చూపితే ఎవరు ఎంత ఎక్కువ మొత్తం వేస్తే వారికే ఆనంబర్‌ కేటాయిస్తారు. ఆప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్నిసార్లు తక్కువ మొత్తానికే పొందుతుండగా చాలాసందర్భాల్లో పోటీదారులు అవగాహనకు వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మొత్తానికే పొందుతున్నట్లు అధికారుల పరిశీలనతో తేలింది.

ప్రైవేట్‌ ప్రమేయం లేకుండా పనిపూర్తి
ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ విధానంలో రవాణాశాఖలోని ఉద్యోగులు, ప్రైవేట్‌వ్యక్తుల ప్రమేయం ఉండదు. ఆయా నంబర్లకు ఎవరు ఎక్కడి నుంచి ఎంతమొత్తం కోట్‌చేశారన్నది నిర్ణీతసమయం ముగిశాకే తెలుస్తుంది. నంబరు కేటాయింపు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

"ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనూతన విధానం అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు"

ఇవీ చూడండి: 'ఉరిశిక్షలు, ఎన్​కౌంటర్లు తాత్కాలిక ఉపశమనాలే...'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.