ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే సరకు నిలిపేయాలని తాజాగా నిర్ణయించింది. సోమవారం నుంచి కేవలం తెలంగాణ జిల్లాల నుంచి రైతులు తెచ్చే ఉల్లిగడ్డలు మాత్రమే కొనుగోలు చేయాలని కమీషన్ ఏజెంట్లను ఆదేశించింది.
రాష్ట్రంలో రైతుల వద్ద ఉల్లి నిల్వలు అధికంగా ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర నుంచి నిత్యం వందలాది లారీల్లో ఉల్లిగడ్డలు తెలంగాణకు వస్తుంటాయి. ఆ రాష్ట్రంలో గడ్డలు పెద్దగా మంచి రంగు, రుచి ఉన్న దృష్ట్యా వాటి ధర అధికంగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండేవి అంత పరిమాణంలో లేనందున ధర కాస్త తక్కువగా ఉంటోంది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు నిలిపేస్తే.. రాష్ట్రంలో వ్యాపారులు ఉల్లిగడ్డల ధరలు పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే లాక్డౌన్ను సాకుగా చూపి కొన్ని చోట్ల చిల్లర వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు.
ఇవీచూడండి: కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు