ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీగానే వరదనీరు వస్తోంది. నారాయణపూర్ జలాశయం నుంచి లక్షా యాభై వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు నాలుగు లక్షలా 90వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా... కిందకు నాలుగు లక్షలా 66వేలు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ఐదు లక్షలా 98వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... దిగువకు ఐదు లక్షలా 90వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
నాగార్జునసాగర్‌కు ఐదు లక్షలా 39వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు ఐదు లక్షలా 63వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ మొత్తాన్ని పూర్తిగా దిగువకు వదులుతున్నారు. నిన్నటితో పోలిస్తే శ్రీరామసాగర్‌కు వరద తగ్గింది. ప్రాజెక్టుకు 66వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... దిగువకు లక్షా 17వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి లక్షా 33వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు.
ఇదీ చదవండి : వరదల నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం