ఆస్తిపన్ను వడ్డీ రాయితీ వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని నవంబర్ 15 వరకు పొడిగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆస్తి పన్ను బకాయిలు భారీగా పేరుకపోవడం వల్ల 2020 మార్చి వరకు ఉన్న పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ కింద వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని సర్కారు తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని పురపాలికలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను పాత బకాయిలను 90 శాతం రాయితీతో నవంబర్ 15 వరకు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. హైదరాబాద్ జల మండలి నల్లా, పాత బకాయిలను వడ్డీ రాయితీతో చెల్లించే అవకాశాన్ని యాజమానులు వినియోగించుకోవాలని సూచించింది.