నవమాసాలు మోసి.. కనీ.. నెల రోజుల పాటు పెంచిన ఓ తల్లి తన కన్న బిడ్డను రోడ్డు పక్కన వదిలివెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కైతలాపూర్‌లో చోటు చేసుకుంది. కైతలాపూర్ పెట్రోల్ పంపు సమీపంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ నెలన్నర వయసున్న పసికందును వదిలి వెళ్ళింది.
స్థానికులు పాప ఏడుపును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్ మొబైల్ వాహనం ఘటనా స్థలానికి చేరుకొని పాపను కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో మహిళా పోలీసులు పాపను శుభ్రపరిచి పాలు తాగించిన అనంతరం సీఐ లక్ష్మీనారాయణ పాపకు ఇందిర అని నామకరణం చేశారు. పాపను చేరదీసి శిశు విహార్‌లో చేర్పించారు.