ETV Bharat / city

TIRUMALA: శ్రీవారికి స్వర్ణ నందకం అందజేసిన భక్తుడు - తితిదేకు ఖడ్గం విరాలం

తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఎం.ఎస్‌.ప్రసాద్‌ రూ.1.8 కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందజేశారు. ప్రస్తుతం స్వామికి ఉన్న ‘సూర్యకఠారి’ (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించామని తెలిపారు. దాతలను తితిదే ఆధికారులు అభినందించారు.

GOLD KNIFE TO TTD, tirumala tirupathi devasthanam
తిరుమల శ్రీవారికి స్వర్ణ ఖడ్గం, శ్రీవారికి స్వర్ణాభరణం
author img

By

Published : Jul 19, 2021, 10:11 AM IST

తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు స్వర్ణ నందకాన్ని విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీవారి భక్తుడు ఎం.ఎస్.ప్రసాద్.. రూ.కోటి 8 లక్షలతో ఆరున్నర కిలోల బంగారంతో స్వర్ణఖడ్గాన్ని తయారు చేయించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఎం.ఎస్.ప్రసాద్ దంపతులు... స్వామివారికి స్వర్ణాభరణం బహుకరించారు. దాతలను తితిదే అధికారులు అభినందించారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి... తీర్థప్రసాదాలను అందజేశారు.

"శ్రీవారికి అన్నమయ్య ద్వారా శ్రీ మహవిష్ణువు నందకాన్ని అందించిన తరహాలో ఓ స్వర్ణ నందకం తయారుచేయాలని సంకల్పించాం. అందులో భాగంగా ప్రస్తుతం స్వామికి ఉన్న 'సూర్యకఠారి' (ఖడ్గం) కొలతలతో స్వర్ణ నందకాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించాం. ఇందుకోసం 6.5 కేజీల బంగారాన్ని వినియోగించాం."

- ఎం.ఎస్​.ప్రసాద్​, శ్రీవారి భక్తుడు

శ్రీవారికి స్వర్ణాభరణం అందజేత

ఇదీ చదవండి: Bonalu : ఆషాడమాస బోనాలతో.. ఆధ్యాత్మిక సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.