ETV Bharat / city

Corona Cases in AP : ఏపీలో ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదు

author img

By

Published : Apr 5, 2022, 9:53 AM IST

Single Corona Case in AP : ఏపీలో 24 గంటల వ్యవధిలో 2,726 నమూనాలు పరీక్షించగా.. కేవలం ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Corona Cases in AP
Corona Cases in AP

Single Corona Case in AP : ఏపీలో 24 గంటల్లో కేవలం ఒకే ఒక కొవిడ్‌ కేసు నమోదైంది. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 2,726 నమూనాలు పరీక్షించారు. వీటి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఒకరికి మాత్రమే వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. మిగిలిన జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరణాలు సంభవించలేదు. 32 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 119 క్రియాశీలక కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అసలు కేసుల్లేవు. ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్క క్రియాశీలక కేసు ఉందని పేర్కొంది.

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 795 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 58 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 0.17 శాతానికి పడిపోయింది. వీక్లీ పాజిటివ్ రేటు 0.22 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,054కు చేరిందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఇవి మొత్తం కేసుల్లో 0.03 శాతమని తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని వెల్లడించింది. 1,280 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 4,30,29,839‬
  • యాక్టివ్ కేసులు: 12,054
  • రికవరీలు: 4,24,96,369
  • మొత్తం మరణాలు: 5,21,416

ఇదీ చదవండి : మరింత తగ్గిన కరోనా వ్యాప్తి.. 800 దిగువకు కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.