స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు. సీఎల్పీ తరఫున ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దివంగత నేతకు నివాళులర్పించారు. రైతు, కార్మిక పక్షపాతిగా వైఎస్సార్ సామాన్య ప్రజానీకానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా పాలన చేశారని పేర్కొన్నారు.
గాంధీభవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మల్లు రవిలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి తెలిజేశారు. అందరికి ఉచిత విద్య, మెరుగైన వైద్యం అందించాలనే గొప్పలక్ష్యంతో వైఎస్ పాలన చేశారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన జలయజ్ఞం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పొన్నాల తెలిపారు. ఆయన చేసిన సేవలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలెప్పుడూ మరిచిపోలేరని మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యుద్ధమేఘాలు- నివురుగప్పిన నిప్పులా నిర్మల హిమగిరులు