హైదరాబాద్ లాలాపేట్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లాలాపేట్‌లో ఓ బార్లో వాచ్‌మెన్‌గా పనిచేసే లాల్ బహదూర్గా పోలీసులు గుర్తించారు. మృతుడు నేపాల్‌కు చెందినవాడని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
లాల్ బహదూర్ రూంమేట్ షేర్ బహదూర్ ఈనెల 10న కరోనాతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం లాల్ బహదూర్‌ను గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. ఆందోళనకు గురైన బాధితుడు.. కరోనా సోకుతుందనే భయం.. ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: అదృశ్యమైన కార్మికుడు.. విగతజీవిగా