గిరిజనలకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారులు జాగ్రత్తగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. గిరిజన విద్యాలయాల పునప్రారంభంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ఇంటివద్దకు వెళ్లి బోధన, ఇతర అంశాలపై చర్చించారు.
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి అధికారులు మరింత శ్రద్ధగా పనిచేయాలని మంత్రి కోరారు. జీవో నంబర్-3 రద్దు మీద పునఃసమీక్ష చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. గతంలోని ఆదేశాల ప్రకారం నియమితులైన వారికి ప్రస్తుత జీవో ప్రకారం నష్టం జరగొద్దన్నారు.
ఇదీ చదవండి : డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు