ETV Bharat / city

కరోనా పరీక్షలు చేయించుకోండి..బహుమతి గెల్చుకోండి

కరోనా పరీక్షలంటే ప్రజలు తెగ భయపడుతున్నారు. దీనికి పరిష్కారంగా తూర్పుగోదావరి జిల్లా అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కరోనా పరీక్షలు స్వచ్ఛందంగా చేయించుకుంటే లక్కీడిప్​లో బహుమతి ఇస్తామని ప్రకటించారు.

corona offer
corona offer
author img

By

Published : Apr 12, 2020, 2:09 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య సిబ్బందికి, యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలా పరీక్షలకు స్వయంగా వచ్చిన వారికి వారానికి ప్రతీ 1000 మందికి లక్కీడిప్‌ తీసి అందులో ఐదుగురికి ప్రోత్సాహకం అందిస్తామని జేసీ లక్ష్మీషా అన్నారు. కత్తిపూడిని రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ర్యాండమ్‌ సర్వే నిర్వహించి 43 మంది నమూనాలు సేకరించామని చెప్పారు. లక్షణాలు గోప్యంగా ఉంచితే ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవడంతోపాటు.. చుట్టుపక్కల వారికి నష్టం కలుగుతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

లక్ష నమూనాల సేకరణే లక్ష్యం

55 లక్షల జనాభా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో లక్ష నమూనాల సేకరణే లక్ష్యంగా నిర్ణయించామని కొవిడ్‌ - 19 ప్రత్యేకాధికారి కాంతిలాల్‌దండే అన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ మురళీధర్​రెడ్డి సూచించారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత దూరంతో పాటు స్వీయ శుభ్రత పాటించాలని కోరారు.

ఇదీ చదవండి: అతడి క్లారిటీ చూసి పోలీసులే షాక్​ అయ్యారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.