![Obscene Dance in YCP MLA's Birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16010242_mla.jpg)
Obscene Dance in YCP MLA's Birthday : ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదికయింది. స్థానిక గడియార స్తంభం కూడలిలో ప్రధాన రహదారికి అడ్డంగా వేదిక ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. 12 గంటలకు ఎమ్మెల్యే కేకు కోసిన అనంతరం ఈ నృత్యాలు సాగినా ఆయన వారించకపోవడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.