ETV Bharat / city

బీసీల ఓట్లతో గెలిచి అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్‌ - పీపుల్స్‌ ప్లాజాలో ఓబీసీ సమావేశం

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా భాజపాకే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బీసీల ఓట్లతో కేసీఆర్‌ గెలిచి వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నెక్లెస్‌ రోడ్‌లో భాజపా ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

obc morcha national president meeting in people's plaza
బీసీల ఓట్లతో గెలిచి బీసీలకు అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్‌
author img

By

Published : Nov 28, 2020, 5:47 PM IST

కేసీఆర్‌ గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టే సత్తా భాజపాకే ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెరాస పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీసీల ఓట్లతో కేసీఆర్‌ అందలమెక్కి వారిని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సమ్మేళనానికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌తో కలిసి లక్ష్మణ్ ముఖ్య అథిగా పాల్గొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పుతామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల అభివృద్ది కోసం పాటుపడుతున్నారని భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బీసీల ఓట్లతో గెలిచి బీసీలకు అన్యాయం చేస్తున్నారు: లక్ష్మణ్‌

ఇదీ చదవండి: 'పటాన్​చెరులో మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.