ETV Bharat / city

నిమ్స్​లో విధులు బహిష్కరించిన నర్సింగ్ సిబ్బంది - నిమ్స్​లో సిబ్బంది నిరసన

సమస్యలు పరిష్కరించాలంటూ... నిమ్స్​లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిమ్స్ డైరెక్టర్ హామీ ఇచ్చేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

nursing-staff-protest-in-nims
నిమ్స్​ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది నిరసన
author img

By

Published : Oct 7, 2020, 11:11 AM IST

Updated : Oct 7, 2020, 1:57 PM IST

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నా... తమకు తగిన గుర్తింపు లేకపోగా సరైన ఇన్సెంటివ్​లు కూడా ఇవ్వడం లేదని... నిమ్స్ ఆసుపత్రి నర్సింగ్ స్టాఫ్ ఆందోళన బాట పట్టారు. నిధులు ఉన్నప్పటికీ తమకు రావాల్సిన ఇన్సెంటివ్​లు ఇవ్వకపోవటం, పలు సమస్యలపై ఈ ఉదయం దాదాపు రెండు గంటలపాటు... అంతర్గత చర్చలు నిర్వహించిన అనంతరం విధులు బహిష్కరించారు.

ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్ స్వయంగా తమకు రాతపూర్వక హామీ ఇచ్చే వరకు విధుల్లో చేరేది లేదన్నారు. సుమారు 150 మంది నర్సింగ్ స్టాఫ్​ను... ఫ్రంట్ వారియర్స్ అంటూ కితాబులు ఇవ్వటమే తప్ప... తమను పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.

నిమ్స్​ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది నిరసన

ఇదీ చూడండి: శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

Last Updated : Oct 7, 2020, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.