ETV Bharat / city

Ntr Trust: వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సాయం... భోజన ప్యాకెట్లు అందజేత - NTR Trust service programs

NTR Trust service programs: వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ ఉదారతను చాటుకుంటున్నారు. నారా భువనేశ్వరి(nara bhuvaneshwari news) ఆదేశాల మేరకు.. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి తాగునీరు, పాలు, బ్రెడ్, భోజన ప్యాకెట్లు అందజేశారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో గల పాతపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. మందులను పంపిణీ చేశారు.

NTR Trust service programs
Ntr Trust
author img

By

Published : Nov 23, 2021, 1:02 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు.. వరద ముంపు ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు.. సేవా కార్యక్రమాలు (ntr trust help flood affected victims) చేపట్టి తమ ఉదారత చాటుకుంటున్నారు. భారీ వర్షాల్లోనూ ట్రస్ట్ సభ్యులు.. మోకాల్లోతు నీళ్లలో ఇంటింటికీ తిరిగి.. తాగునీరు, పాలు, బ్రెడ్, భోజన ప్యాకెట్లు అందజేశారు. ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేసి.. పాతపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మందులను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పంపిణీ(NTR Trust service programs) చేశారు. తిరుపతి ఆటోనగర్, గొల్లవానికుంట ప్రాంతాల్లో 1500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లో.. వరద బాధిత కుటుంబాలకు సాయం చేశారు. భోజన పంపిణీ (NTR Trust food distribution)తో పాటు ఇతర సహాయ చర్యలు చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గం బండారుపల్లి గ్రామంలో బాధిత కుటుంబాలకు 1500 ఆహార ప్యాకెట్లు, కోవూరులో 2 వేల ప్యాకెట్లను ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు.

ఇదీ చదవండి: Tdp Parliamentary Letter to PM: "వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.