'పుష్ప' విడుదల సందర్భంగా ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఇప్పుడు మరో ఈవెంట్‌కు సిద్ధమైంది. ఈరోజు రాత్రి ముంబయిలో 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్న చిత్రం బృందం.. బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్ అంటూ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
-
Backstage bromance… Gearing up for #RoarofRRRinMumbai 💥💥❤️🔥 pic.twitter.com/oyYywndOO4
— RRR Movie (@RRRMovie) December 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Backstage bromance… Gearing up for #RoarofRRRinMumbai 💥💥❤️🔥 pic.twitter.com/oyYywndOO4
— RRR Movie (@RRRMovie) December 19, 2021Backstage bromance… Gearing up for #RoarofRRRinMumbai 💥💥❤️🔥 pic.twitter.com/oyYywndOO4
— RRR Movie (@RRRMovie) December 19, 2021
రాబోయే మూడు వారాలు కూడా ఫుల్ క్రేజీ, ఫన్ ఉండబోతుందని 'ఆర్ఆర్ఆర్' టీమ్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సినిమాను ప్రచారం చేయడం సహా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చాలా ఉంటాయని చెప్పారు. అన్నింటికీ అభిమానులు గెట్ రెడీ కావాలని ఇటీవలే ట్వీట్ చేశారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.
ఇదీ చూడండి: 'శ్యామ్ సింగ రాయ్' సెన్సార్ పూర్తి.. 'గాడ్సే' కొత్త అప్డేట్