ETV Bharat / city

యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను వెల్లడించిన ఎన్​టీఏ

యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్​టీఏ) వెల్లడించింది. పలుమార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్​, డిసెంబర్​ నెలల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను వెల్లడించిన ఎన్​టీఏ
యూజీసీ-నెట్​ పరీక్ష తేదీలను వెల్లడించిన ఎన్​టీఏ
author img

By

Published : Oct 26, 2021, 12:15 PM IST

అసిస్టెంట్​ ప్రొఫెసర్ల​ ఎంపిక కోసం నిర్వహించే యూజీసీ-నెట్​(జాతీయ అర్హత పరీక్ష) (2020 డిసెంబర్​, 2021 జూన్​) పరీక్ష తేదీలను ఎన్​టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) వెల్లడించింది. యూజీసీ నెట్​ డిసెంబర్​ 2020 పరీక్షలను నవంబర్​ 20, 21, 22, 24, 25, 26, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా నెట్​ జూన్​ 2021 పరీక్షలను డిసెంబర్​ 1, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.

అయితే ఈ యూజీసీ నెట్​ పరీక్షలను ఈ నెల​ 17 నుంచి 25 మధ్యలో నిర్వహించాలని గతంలో నిర్ణయించినా.. ఆ తేదీల్లో ఇతర ప్రవేశ పరీక్షలు ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నవంబర్​, డిసెంబర్​ నెలల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్​టీఏ స్పష్టం చేసింది. ఈ నెట్​ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. దీనిని కంప్యూటర్​ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.

For All Latest Updates

TAGGED:

UGC EXAM
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.