ETV Bharat / city

సోయి లేకుండానే దారుణాలు..!

మహిళలపై జరుగుతున్న దాడులపై కారణాలను ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. అత్యధిక శాతం దాడులు మద్యం మత్తులో జరిగినట్లు జాతీయ నేర గణాంక నమోదు సంస్థ(ఎన్‌ఆర్‌సీబీ) లెక్కల స్పష్టం చేస్తున్నాయి. తాగిన మైకంలో ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో నేరాలకు తెగబడుతున్నారు. తెలిసిన వారి చేతల్లో దాడులకు గురైన వారి సంఖ్య భారీగానే ఉంటుంది.

NRCB REPORTS ATTACKS ON WOMEN
సోయి లేకుండానే దారుణాలు..!
author img

By

Published : Dec 4, 2019, 11:08 AM IST

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలంలో కంసాన్‌పల్లిలో కన్నతల్లినే రోకలి బండతో కొట్టి చంపాడో కుమారుడు... శంషాబాద్‌ తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ దగ్గర ఓ యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా చంపి కాల్చేశారో నలుగురు కిరాతకులు.. జీడిమెట్లలో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామంతో కళ్లు మూసుకుపోయిన కన్నతండ్రి.. మద్యం తాగితే.. మనిషికి మృగానికి తేడా ఉండదనడానికి ఇటీవల నగరంలో జరిగిన ఈ ఘటనలే నిదర్శనాలు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్పృహ లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు.

ఏం చేస్తున్నారో తెలియకుండానే..!

అంతకు ముందు ఏం చేస్తున్నారో స్పృహ ఉంటుంది. కానీ మద్యం తాగిన తర్వాత విచక్షణ కోల్పోతారు. ఏం చేస్తున్నారో సోయి ఉండదు. నేరానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయముండదని నిపుణులు వివరిస్తున్నారు. తాజాగా శంషాబాద్‌ శివారుల్లో యువ వైద్యురాలు దిశ హత్యోదంతానికి మద్యం మత్తు ప్రధాన కారణమని స్పష్టం చేస్తున్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ(ఎన్‌ఆర్‌సీబీ) లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 శాతం నుంచి 85 శాతం మద్యం మత్తులో జరుగుతున్నవే కావడం గమనార్హం.

రక్త సంబధీకులనూ వదలడం లేదు..!

మద్యం మత్తులో రక్త సంబంధీకులనూ వదలడం లేదు. మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువకుల సంఖ్య భారీగానే ఉంటుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. యువ వైద్యురాలు దిశ హత్యోదంతంలో ముగ్గురు నిందితుల వయస్సు 20 ఏళ్లే కావడం గమనార్హం. చిన్నతనంలోనే మద్యానికి బానిసై నేరం చేస్తే ఏమవుతుందిలే మహా అయితే కొంత కాలం శిక్ష పడుతుందనే భావనతో యువకులు నేరాలకు తెగబడుతున్నారని నిపుణులు వివరిస్తున్నారు.

ఎలాంటి నేర చరిత్ర లేకున్నా..!

మద్యం మత్తులో నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో అధిక శాతం మందికి అంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర ఉండదు. అయినా నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేరం బయటపడుతుందనే భయంతో కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా యువ వైద్యురాలు దిశ మృతదేహంపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా నిందితులు పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి బెరుకు లేకుండా 28 కి.మీలపాటు ప్రధాన రహదారిపై మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్‌, డీజిల్‌తో కాల్చేశారు.

ఇవీచూడండి: అడుగడుగునా కాటేసే రాక్షసులు.. బాధితులకు దక్కని న్యాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.