కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. నోరో వైరస్‌గా(norovirus transmission) పిలుస్తున్న ఈ వ్యాధి.. రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకింది. వీరందరూ వయనాడ్ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులని సమాచారం(kerala virus outbreak). వాంతులు, డయేరియాను ఈ వైరస్(norovirus 2021) లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
నోరో వైరస్ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ)కి పంపించారు.
తాజా పరిస్థితులపై అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమావేశమయ్యారు. వైరస్ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి- ఏడుగురు మృతి