దసరా పండుగ సందర్భంగా భారీగా ఆశలు పెట్టుకున్న మటన్, చికెన్ వ్యాపారులు నిరాశకు గురయ్యారు. నాన్ వెజ్ మార్కెట్లు అత్యధికశాతం వెలవెలబోయాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమ్మకాలు బాగా జరగ్గా, ఎక్కువ చోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి. గతం కంటే ఇవాళ హైదరాబాద్- సికింద్రాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
దసర పండుగ వచ్చిందంటే చాలు నగరంలోని నాన్‌వెజ్‌కు డిమాండ్ అధికంగా ఉంటుంది. నాన్‌వెజ్ మార్కెట్ ఎదుట జనాలు క్యూ కట్టేవారు. కానీ ఈ విజయదశమి రోజున మాత్రం నగరంలోని మటన్, చికెన్ షాపుల్లో అమ్మకాలు మాత్రం సాధారణం కంటే తక్కువగానే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దసరా రోజు అమ్మవారికి కోళ్లు, పోట్టేళ్లు మొక్కుగా ఇవ్వడం వల్ల దుకాణాల్లో కొనుగోలు చేసేవారు తక్కువగా ఉంటారని కొందరు చెబుతున్నారు.
గతవారమే చికెన్, మటన్ ధరలు పెరిగాయని.. దసరా సందర్భంగా ఎలాంటి ధలు పెంచలేదని వ్యాపారులు అంటున్నారు. రోజూ అమ్మే ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి: Cm Kcr Pooja: ప్రగతిభవన్‌లో నల్లపోచమ్మకు కుటుంబసమేతంగా సీఎం పూజలు